చీడికాడ కోణాo, దండి సురవరం లో పశు ఆరోగ్య శిబిరాలు

6చూసినవారు
చీడికాడ కోణాo, దండి సురవరం లో పశు ఆరోగ్య శిబిరాలు
చీడికాడ మండలంలోని కోణాo, దండి సురవరం గ్రామాలలో గురువారం పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు దండి సురవరం శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ శిబిరాలలో 34 పశువులకు సాధారణ చికిత్సలు, 40 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, 9 పశువులకు చూడి పరీక్షలు, 44 పశువులకు, 39 పెయ్యలకు నట్టల నివారణ మందులు అందించారు. మొత్తం 51 మంది రైతులు ఈ సేవలను వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్