ధనుర్మాసంలో మాడుగుల సీతారామ భక్త బృందం ఆధ్వర్యంలో పురవీధుల్లో నిర్వహిస్తున్న మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా, నల్లబిడ్డి నాగు కృష్ణకుమారి దంపతుల సహాయంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 110 మందికి అల్పాహారం కూడా అందించారు. సీతారామ భక్త బృందం దాతలను ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాలని కోరింది.