ఈ నెల 6న కేజే పురంలో లేగ దూడల ప్రదర్శన

2చూసినవారు
ఈ నెల 6న కేజే పురంలో లేగ దూడల ప్రదర్శన
మాడుగుల మండలం కే. జే. పురం గ్రామంలో ఈనెల 6వ తేదీన లేగదూడల ప్రదర్శన నిర్వహించనున్నట్లు మాడుగుల ప్రాంతీయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి. చిట్టి నాయుడు తెలిపారు. సంవత్సరం లోపు వయసున్న జెర్సీ, హెచ్.ఎఫ్, ఒంగోలు, పుంగనూరు, దేశవాళి మరియు ముర్రా గేదె జాతి ఆడ లేగదూడలతో పాడి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రదర్శనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సముద్ర శాఖ అధికారులు కూడా పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్