తిరుపతి లడ్డుపై అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. శనివారం మాడుగుల వెంకన్న ఆలయంలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. లడ్డు ప్రసాదంలో కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేశారని, కానీ పరీక్షల్లో అది నిర్ధారణ కాలేదని, కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీపై తప్పుడు ప్రచారం చేసిందని ఆయన మండిపడ్డారు.