చీడికాడ మండలం ఎల్బి పట్నం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. నూతన సాంకేతిక విధానాలతో రాజమద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల పట్ల స్పష్టమైన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదని, గత పాలకులు ద్వంద విధానాల మూలంగా రైతులకు ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.