చీడికాడ; ఈనెల12 న జరిగే సమ్మె జయప్రదం చేయండి

7చూసినవారు
చీడికాడ; ఈనెల12 న జరిగే సమ్మె జయప్రదం చేయండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. గురువారం చీడికాడ మండల ఆటో యూనియన్ సదస్సులో సీఐటీయూ ఆటో యూనియన్ నాయకులు కె. దేముడు నాయుడు, కొమనాపల్లి వెంకట్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్