చీడికాడ మండలం కోనాం పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాజులపాలెం, మళ్ళిపాడు, చెరుకుపల్లి రోడ్లతో పాటు, గుడివాడ వెళ్లే బ్రిడ్జి నుంచి వాలాబు వరకు, వాలాబు నుండి రెల్లలపాలెం వరకు కొత్త రోడ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. వాలాబు నుండి గొడుగుమామిడి వరకు గతంలో ఏర్త వర్కులు చేసినా రోడ్లు పూర్తి చేయలేదని ఆయన తెలిపారు.