దేవరాపల్లి మండలం, నాగయ్యపేట గ్రామంలో కాశీపురం ఎంపీటీసీ వంటాకు పైదితల్లమ్మ, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం వైద్య కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ పరిపాలన వలన జరుగుతున్న ఇబ్బందులు, అన్యాయాలను వివరిస్తూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా చూసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.