జి. మాడుగుల మండలం గెమ్మెలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశ కార్యకర్త సప్పి కొండమ్మ (59) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కుండంగి బైలువీధికి చెందిన కొండమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది, తోటి ఆశ కార్యకర్తలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.