దేవరాపల్లి మండల కేంద్రంలో బారీ వాహనాలతో జరుగుతున్న మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న సోమవారం పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో రైతులు సొంత పొలాలకు మట్టి తవ్వుకుంటుంటే, అనుమతులు లేవంటూ రెవెన్యూ అధికారులు వాహనాలను సీజ్ చేసి, రైతులు కోర్టు నుండి అనుమతి తెచ్చుకునే వరకు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈ అక్రమ తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.