బుధవారం, కే కోటపాడు మండలం చౌడువాడలో మూడు కోట్ల 65 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, విద్యుత్ ఎస్సీఈ జి ప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సబ్ స్టేషన్ మాడుగుల నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తుంది.