కే కోటపాడు; 9 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

4చూసినవారు
కే కోటపాడు; 9 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
మాడుగుల నియోజకవర్గ పరిధిలోని కే కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు, కాలవలు, రెండు కోట్ల 49 లక్షల రూపాయలతో నిర్మించిన జల జీవన్ మిషన్ ఇంటింటి కొళాయిలను ఆయన ప్రారంభించారు. మొత్తం 9 కోట్ల 69 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్