స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. సోమవారం కే కోటపాడు మండలం సూరెడ్డిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.