కార్తీకమాసంలో వచ్చే పవిత్రమైన పౌర్ణమి వేడుకలను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలను సందర్శించి, కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి స్వామివారిని వేడుకున్నారు. మడుగుల శ్రీకృష్ణ గోపాలస్వామి ఆలయం, ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయం, భీమలింగేశ్వర స్వామి ఆలయం, స్వర్గ లింగేశ్వర స్వామి ఆలయాల్లో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని వీధి దేవాలయాల్లో కూడా కుల వనం వేడుకలు నిర్వహించారు.