చీకట్లో కే కోటపాడు ఆసుపత్రి.. రోగులు ఆందోళన

9చూసినవారు
చీకట్లో కే కోటపాడు ఆసుపత్రి.. రోగులు ఆందోళన
కే కోటపాడులోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం సాయంత్రం చీకటిమయంగా మారుతోంది. ఆసుపత్రి బయట వీధి దీపాలు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చేవారు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి కనిపించక అవస్థలు పడుతున్నారని, అత్యవసర కేసుల్లో సమయానికి ఆసుపత్రికి చేరుకోలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారని, వెంటనే లైట్ల సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు తెలిపినా చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు.

ట్యాగ్స్ :