మాడుగుల మండలంలోని 27 పంచాయతీల్లో రి సర్వే పూర్తయిన తర్వాత, రాజముద్రతో కూడిన 10,600 పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పొంగలిపాకలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, రోజుకు రెండు మూడు గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ, వాటి ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. శనివారంతో ఈ కార్యక్రమం దాదాపుగా ముగిసిందని ఎం.డి. ఓకే అప్పారావు, తాహాసిల్దార్ కే రమాదేవి తెలిపారు.