మాడుగుల కోర్టు సముదాయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 45 కేసులు పరిష్కారం అయ్యాయి. మాడుగుల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎన్ లావణ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 8 క్రిమినల్ కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో 1, 75, 035 రూపాయలను పరిష్కరించారు. అలాగే 37 ఎక్సైజ్ కేసులను పరిష్కరించి 1, 75, రూపాయలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసులు పాల్గొన్నారు.