ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. వెంకన్న ఆదివారం మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 2026 శ్రామిక ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, బడా పెట్టుబడికి మద్దతు ఇచ్చే ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కార్పొరేట్లకు, బడా పెట్టుబడికి అనుకూలంగా ఉందని, కొన్ని పరిశ్రమలకు పన్ను రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం ద్వారా బడా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశంలోని శ్రామిక వర్గ ప్రజల ప్రయోజనాలను విస్మరించిందని ఆయన ఆరోపించారు.