వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోఆర్డినేటర్లను నియమించారు. ఈ నియామకాల్లో భాగంగా, మాడుగుల మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాల కోఆర్డినేటర్గా నియమించారు. ఈ నిర్ణయంతో మాడుగుల నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.