మాడుగుల;మోదకొండమ్మ వారి ఆలయ అభివృద్ధికి 25, 000 విరాళం

1చూసినవారు
మాడుగుల;మోదకొండమ్మ వారి ఆలయ అభివృద్ధికి 25, 000 విరాళం
గురువారం, మాడుగుల మండలం ఎం కోడూరులోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన కొల్లి శంకర్రావు దంపతుల కుమార్తె ఆర్లి కుమారి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తంతో ఆలయానికి ప్రహరీ గోడ, ఇనుప గేటు ఏర్పాటు చేస్తామని గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి సంజీవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముమ్మిన రమణబాబు, టిడిపి నాయకుడు విశ్వనాథ్, వానపల్లి వేణు, పోతిని జగదీష్, వడ్డాది గణేష్, పోలిపల్లి కృష్ణ, రాయపరెడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :