మాడుగుల;గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

6చూసినవారు
మాడుగుల;గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
మాడుగుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నందారపు సన్యాసిరావు, పుప్పాల రమేష్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త గ్రామస్థాయి కమిటీలతో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఇకనుంచి ప్రతి నెలా 5వ తేదీన గ్రామ స్థాయి సమావేశం, 9వ తేదీన మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక్కో మండల కమిటీ సభ్యునికి ఒక్కో యూనిట్ ను ఇంచార్జిగా నియమించడం జరిగిందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్