మాడుగుల;జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు

11చూసినవారు
మాడుగుల;జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మాడుగుల వీనస్ కోచింగ్ కేంద్రంలో చెకుముకి మండల స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలకు మాడుగుల, చీడికాడ, బుచ్చయ్య పేట మండలాల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. గెలుపొందిన విద్యార్థులు ఈ నెల 23న జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారు. మండల స్థాయి ప్రశ్న పత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాదు శ్రీనివాస్, సర్పంచ్ కళావతి, జిల్లా కార్యదర్శి తాళ్ళపురెడ్డి నాగచంద్ర, జీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్