మాడుగుల; రేపు కింతలి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం

10చూసినవారు
మాడుగుల; రేపు కింతలి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం
బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మాడుగుల మండలం కింతలిలో 3 కోట్ల 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్స్టేషన్ ను రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, ఈపీడీసీఎల్ సిఎండి, జిల్లా పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పివిజి కుమార్ పాల్గొంటారని కింతలు ఎంపీటీసీ ఎం. సన్యాసిరావు, సహకార సంఘ అధ్యక్షుడు దేవుడు తెలిపారు.