మాడుగుల బస్టాండ్ ఆవరణలోని శ్రీ దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి, మండప నిర్మాణానికి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యురాలు షేక్ ఉన్నిష తన గ్రామం నుంచి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని గురువారం సాయంత్రం చెక్కు రూపంలో ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శి ఏఎన్వి ప్రసాదరావు, సభ్యులు ఎస్ వెంకటరాజు, వైసిపి నాయకులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, హేమంత్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.