శుక్రవారం మాడుగుల మండలం పొంగలిపాక గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఇకపై రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన 'రాజముద్ర'తోనే పాస్ పుస్తకాలు జారీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, డిసిసిబి చైర్మన్ కొన తాతారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.