మాడుగుల బీసీ హాస్టల్లో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీపీఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తీవ్రంగా స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు కారణాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులను స్కూల్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నరేష్, సూపరింటెండెంట్, హాస్పిటల్ సిబ్బంది విద్యార్థులను పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.