గురువారం మాడుగుల గ్రామ పంచాయతీ పరిధిలో నిత్యం జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను స్థానిక ఎండిఓ కే అప్పారావు ఆకస్మికంగా పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ, సంపద తయారీ కేంద్రం నిర్వహణ వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. అనంతరం, మాడుగుల 1, 2, 3 సచివాలయాలలో గ్రామ సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న కుటుంబ సర్వేలను సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు అందించారు.