మాడుగుల మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వేగి శరత్ చంద్ర, ఆర్ఆర్బీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విజయవాడ డివిజన్లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో జూనియర్ ఇంజనీర్ గా బాధ్యతలు స్వీకరించారు. కేజీపురం గ్రామానికి చెందిన శరత్ చంద్ర, మాడుగుల ఎం కృష్ణ పురం గ్రామంలో ఐదేళ్లుగా విధులు నిర్వర్తించారు. ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఆర్ఆర్బీ పరీక్షల్లో విజయం సాధించి, ప్రస్తుతం సికింద్రాబాద్లో శిక్షణ పొందుతున్నారు. తనను ప్రోత్సహించిన ఎండిఓ అప్పారావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.