మాడుగుల;కాలినడకన సింహాచలం యాత్ర

8చూసినవారు
మాడుగుల;కాలినడకన సింహాచలం యాత్ర
మాడుగుల మండలం కేజే పురం, వంటర్లపాలెం గ్రామాల్లో సింహాద్రి అప్పన్న స్వామి మాల ధరించిన భక్తులు ఆదివారం కాలినడకన సింహాచలం బయలుదేరి వెళ్లారు. ధనుర్మాసం ప్రారంభం రోజున ప్రతి ఏడాది నెలరోజుల దీక్ష అనంతరం పాదయాత్రతో సింహాచలం చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కేజీ పురం నుంచి 30 మంది భక్తులు బయలుదేరగా, చోడవరం పరిసరాల నుంచి మరికొంతమంది చేరనున్నారు. మాలధరించని భక్తులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్