మాడుగుల సీతారామస్వామి భక్త బృందం మేలుకొలుపు కార్యక్రమం

9చూసినవారు
ధనుర్మాసం సందర్భంగా, శనివారం తెల్లవారుజామున మాడుగుల సీతారామస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఎం గదబూర్ గిరిజన గ్రామంలో మేలుకొలుపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మంది భక్తులు పాల్గొని, దేవుని కీర్తనలు చేస్తూ పురవీధుల్లో ఊరేగి, మాడుగుల ఆలయానికి చేరుకున్నారు. సంక్రాంతి పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి కొట్టేయడం మల్లికార్జున రావు మాస్టారు, సిరిపిల్లి సూర్యనారాయణ మాస్టారు సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్