నిన్న మొన్నటి వరకు గ్రామాలు, తీర్థాలలో ఐస్ క్రీమ్ విక్రయించి జీవనోపాధి పొందిన మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారం చెందిన దొండ రాజేష్, తాజాగా ప్రభుత్వ ఉద్యోగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా స్థానం సంపాదించాడు. దూర విద్య ద్వారా డిగ్రీ, ఏయూలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన రాజేష్, ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలో విజయం సాధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన వి ఎన్ ఎం అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.