అనకాపల్లి ఉత్సవం విజయవంతం చేయాలని ఎంపీపీ, ఎండిఓ విజ్ఞప్తి

1చూసినవారు
అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈనెల 30, 31 తేదీల్లో జిల్లాలో నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ టి వి రాజారామ్, ఎండిఓ కే అప్పారావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, వివోఏలు, అంగన్వాడి కార్యకర్తలతో ఎంపీ అధ్యక్షతన అవగాహన సమావేశం జరిగింది. అనంతరం కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ లో మానవహారం ఏర్పాటు చేశారు.