షెల్టర్ నిర్మాణంతో దేవి ఆలయానికి కొత్త శోభ

6చూసినవారు
షెల్టర్ నిర్మాణంతో దేవి ఆలయానికి కొత్త శోభ
మాడుగుల దేవి అమ్మవారి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన షెడ్డు నిర్మాణంతో ఆలయానికి కొత్త అందం వచ్చింది. భక్తుల సౌకర్యార్థం, ఉత్సవాల నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో ఆలయాన్ని సందర్శించిన డైరీ చైర్మన్ ఆర్డర్ ఆనంద్ కుమార్, డైరీ డైరెక్టర్ పిల్ల రామాకుమారి ఇచ్చిన హామీ మేరకు డైరీ నుంచి రూ. 5 లక్షలు షెడ్డు నిర్మాణానికి మంజూరయ్యాయి. ఈ నిర్మాణం బుధవారం పూర్తయింది. గురువారం డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఈ షెడ్డును ప్రారంభిస్తారని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఎస్ వి కొండలరావు, కార్యదర్శి ఏ ఎన్ వి ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్