ఎన్టీఆర్ భరోసా పెన్షన్: ఇంటింటికీ వెళ్లి అందజేత

796చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్: ఇంటింటికీ వెళ్లి అందజేత
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి సచివాలయం సిబ్బందితో పాటు కూటమి నేతలు కలిసి పెన్షన్ అందించారు. రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యతను ప్రజలు గమనించాలని, పెట్టుబడులు తీసుకువస్తూ, సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు కే వి ఎస్ ఎస్ వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కిముడు కళ్యాణం, రీమిలీ కొండబాబు, వంతల గణపతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్