వైసిపి నాయకులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టండి

5చూసినవారు
వైసిపి నాయకులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టండి
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వరుసగా వైసిపి నాయకులపై దాడులు చేస్తున్న టీడీపీ గుండాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రశ్నించే వారిని అంతం చేయడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. తిరుపతి లడ్డులో కొవ్వులేదని ల్యాబ్ రిపోర్ట్ తేల్చడంతో చంద్రబాబు అహం దెబ్బతిందని, ప్రజలు చీదరించుకోవడంతో తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని వారి ఆశయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్