సోమవారం సాయంత్రం మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ప్రభుత్వానికి ధాన్యం అమ్మి లాభం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, సహకార సంఘ అధ్యక్షుడు సన్యాసిరావు, వ్యవసాయ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.