దేవరాపల్లి మండలం తామారబ్బ యూపీ స్కూల్‌లో అదనపు ఉపాధ్యాయులను నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, మంగళవారం దేవరాపల్లి పర్యటనకు వచ్చిన డీఈఓ అప్పారావు నాయుడును కోరారు. ఈ స్కూల్‌లో 52 మంది ఆదివాసీ, గిరిజన విద్యార్థులు ఉన్నారని, 1 నుండి 5వ తరగతి వరకు 30 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియజేశామని పేర్కొన్నారు.