
ముంబైలో సిరాజ్, మహీరా శర్మ.. వీడియో వైరల్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, నటి మహీరా శర్మ ముంబైలోని ఒకే రెస్టారెంట్ వద్ద కనిపించడంతో వారిద్దరిపై డేటింగ్ పుకార్లు మళ్లీ మొదలయ్యాయి. గతంలోనూ వీరిద్దరి మధ్య సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అప్పట్లో మహీరా శర్మ తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. సిరాజ్ కూడా తనపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, ఆ తర్వాత తొలగించారు. ప్రస్తుతం సిరాజ్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి సంబంధంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.




