నర్సీపట్నంలో వైభవంగా లక్ష ప్రమిదల దీపారాధన

1058చూసినవారు
నర్సీపట్నంలో వైభవంగా లక్ష ప్రమిదల దీపారాధన
నర్సీపట్నం శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం భీష్మ ఏకాదశి వేడుకలు, 24వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమం కనువిందుగా సాగింది.

ట్యాగ్స్ :