మద్దివీధిలో పశువుల వరుస మరణాలు

527చూసినవారు
మద్దివీధిలో పశువుల వరుస మరణాలు
పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ మద్దివీధిలో ఆవులు, పాడి గేదెలు వరుసగా మృత్యువాత పడుతుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కలుషిత నీరు తాగడం, ప్లాస్టిక్ వ్యర్థాలు మేయడం, అంతుచిక్కని వ్యాధులు, సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వంటి కారణాలతో పశువులు చనిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పశుసంపదే జీవనాధారంగా ఉన్న తమకు ఈ పరిస్థితి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని బాధితులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్