రెండు రోజుల్లో ఫైళ్లు సమర్పించాలి

577చూసినవారు
రెండు రోజుల్లో ఫైళ్లు సమర్పించాలి
అల్లూరి జిల్లాలో ఐవీఆర్ఎస్ కాల్స్‌లో ఎక్కువ ప్రతికూల స్పందన వచ్చిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశించారు. సంబంధిత మండల తహసీల్దార్లు రెండు రోజుల్లోగా కలెక్టరేట్‌కు ఫైళ్లను తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని 1,400 గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేకు సంబంధించిన మ్యుటేషన్ ఫైళ్లను జాగ్రత్తగా భద్రపరచాలని, జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్