నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ కారు ధ్వంసం కావడం రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనను మాజీ సీఎం
జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా మంగళవారం 'చలో నర్సీపట్నం'కు
వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది.