అల్లూరి జిల్లా అరకులోయ మండలం ఎండపల్లి వలస గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల రెడీనెస్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిలో సాయిరాం హాజరై, చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్య నైపుణ్యత, ఆరోగ్యం, పరిశుభ్రత, శారీరక అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అంగన్వాడి టీచర్ కిల్లో అరుణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుస్మిత, సూపర్వైజర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.