అంతర్ల గ్రామస్తుల నీటి కష్టాలు తీర్చిన అధికారులు

481చూసినవారు
అంతర్ల గ్రామస్తుల నీటి కష్టాలు తీర్చిన అధికారులు
చింతపల్లి పంచాయితీ పరిధిలోని అంతర్ల గ్రామంలో గత వారం రోజులుగా చేతిపంపు బోర్ రిపేర్ సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద రావు అధికారులకు సమాచారం అందించడంతో, నాలుగు రోజుల్లో చేతిపంపు మరమ్మతులు పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామ ప్రజలకు పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మోటార్ పంపు రిపేర్ పనులు కూడా పూర్తి చేసి ఇంటింటికీ నీటి సరఫరా అందిస్తున్నారు. గ్రామస్తులు అధికారులకు, రీమల ఆనంద రావు కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్