నిరీక్షణకు తెర.. 246 మంది రైతులకు 186 ఎకరాల భూమి అప్పగింత

9చూసినవారు
నిరీక్షణకు తెర.. 246 మంది రైతులకు 186 ఎకరాల భూమి అప్పగింత
గత 13 ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి, మాకవరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం వెల్లడించారు. 2012లో ఏపీఐఐసీ కోసం సేకరించిన భూముల్లో రికార్డుల పరమైన లోపాలు తలెత్తాయని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you