నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్దబొడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర మంగళవారం తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి జనసేన చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ పంపిణీ జరిగిందని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో చదువు కీలక పాత్ర పోషిస్తుందని, వారు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సూర్యచంద్ర తెలిపారు.