మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రూ. లక్ష విరాళం ప్రకటించి, రూ. 40 లక్షల నిధుల సమీకరణకు కృషి చేశారు. బుధవారం సేకరించిన విరాళాలతో కళాశాల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కళాశాలను సందర్శించి, నూతన గేటు నిర్మాణం, పటిష్టమైన ప్రహరీ గోడ, పాత భవనాల తొలగింపు, భవనాలకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు.