నర్సీపట్నం: ఆపదలో పేదలకు కొండంత అండ ‘సీఎంఆర్‌ఎఫ్’

6చూసినవారు
నర్సీపట్నం: ఆపదలో పేదలకు కొండంత అండ ‘సీఎంఆర్‌ఎఫ్’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని తెలిపారు. శనివారం నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ. 13,30,218 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజాసేవయే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే నిరుపేదలకు ఈ నిధి ఒక వరంలా మారిందని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్