రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నర్సీపట్నం మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన 'రాజముద్ర'తోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆయన మండిపడ్డారు.