దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం నర్శీపట్నంలో దివ్యాంగులతో జరిగిన సమావేశంలో ఆయన వారి సమస్యలను విని, పరిష్కారంపై భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.